తరువాత ఒక గంటకు ముగ్గురూ స్నానాలు చేసి డైనింగ్ హాల్లోకి వచ్చేసరికి వాచ్ మెన్ వాళ్ళకు టిఫిన్ రెడీ చేసాడు. రాత్రంతా ముగ్గురూ బాగా బెడ్ మీద కష్టపడి అలిసిపోవడంతో ఆవురావురుమంటూ ఆపకుండా టిఫిన్ తినేసారు. టిఫిన్ చేయడం పూర్తి అయిన తరువాత టీ తాగేసి కోట వైపు బయలుదేరారు. కోట లోకి వెళ్ళిన తరువాత ముగ్గురూ అక్కడ వస్తువులను, ఇంతకు ముందు రాజులు వాడిన ఆయుధాలను చూస్తున్నారు. అంతలో ఆ కోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సుమిత్రకు షేక్ హ్యాండ్ ఇస్తూ, “సుమిత్ర గారు….ఎలా ఉన్నారు,” అనడిగాడు. సుమిత్ర కూడా అతని వైపు చూసి నవ్వుతూ, “బాగున్నానండి….మీరు ఎలా ఉన్నారు…చాలా బిజీగా ఉన్నట్టున్నారు….మనం కలిసి చాలా రోజులు అయింది,” అన్నది. “అవును సుమిత్ర గారు….మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉన్నది…చాలా పని ఎక్కువయింది….ఈ కోటని మ్యూజియం లాగా మార్చి….క్యూరేటర్ గా ప్రమోషన్ వచ్చేసరికి సరికి పని చాలా ఎక్కువయింది,” అన్నాడు ఆఫీసర్. “అవునా….చాలా సంతోషం ఆఫీసర్ గారు….మేము వచ్చి మీ పని ఏమైనా డిస్ట్రబ్ చేసినట్టున్నాము,” అన్నది సుమిత్ర. “మరీ అంత ఫార్మాలిటీ అక్కర్లేదు సుమిత్ర గారు….మీరు ఇక్కడకు రావడమే మాకు చాలా సంతోషంగా ఉన్నది….అలాంటప్పుడు మా పని ఎలా డిస్ట్రబ్ అవుతుంది…” ఆనందంగా అంటున్నాడు ఆఫీసర్. సుమిత్ర తనతో పాటు వచ్చిన రాము, మహేష్ లని ఆఫీసర్ కి పరిచయం చేసింది. ఇంతకు ముందే సుమిత్ర ఆయనకు ఫోన్ చేసి వస్తున్న పని చెప్పడంతో అతను వాళ్ళను కోట లొపలికి తీసుకెళ్లాడు. “ఈ మధ్య నేను కూడా చాలా బిజీ అయ్యానండీ….అవును ఈ కోటని జైలుగా ఎందుకు చేసారు….ఇది ఏ కాలం నాటిది,” అనడిగింది సుమిత్ర. “దాదాపు 350 ఏళ్ళ క్రితం కోట సుమిత్ర గారు….దీన్ని ఆ కాలంలో మహరాజు గజసింహులు ఉండేవారు….ఆయన దీన్ని విలాస మందిరంగా వాడేవారు….ఆయన తరువాత ఆయన కొడుకు దీన్ని జైలుగా మార్చేసాడు….అప్పటి నుండి ఈ కోటని బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళే వరకు దీన్ని జైలు కిందనే వాడారు….తరువాత కొన్నేళ్ళకు దీన్ని మ్యూజియం చేసేసారు,” అంటూ ఆఫీసర్ వాళ్ల ముగ్గురిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గది మొత్తం పైనుండి కింద దాకా ఫైళ్ళతో నిండిపోయి ఉన్నది. ఆఫీసర్ వెనక్కు తిరిగి సుమిత్ర వైపు చూసి, “ఇదే మీరు అడిగిన రికార్డ్ రూమ్….ఈ రికార్డ్స్ లో ఇంతకు ముందు ఇక్కడ కారాగారంలో శిక్ష అనుభవించిన ప్రతి ఒక్కరి వివరాలు ఉన్నాయి….అందులో కొంత మంది ఎందుకు జైలుకు వచ్చారో వివరాలు కూడా ఉన్నాయి….అదీ కాక అప్పట్లో ఫైలింగ్ సరిగా చేసే వాళ్ళు కూడా కాదు….అందుకని ఏ కేసు వివరాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు…..ఏ పేరైనా ఎక్కడైనా ఉండొచ్చు….మీరు ఎంత సేపు కావాలంటె అంత సేపు ఇక్కడ ఉండొచ్చు….మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి,” అంటూ సుమిత్రకు షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ వెళ్లిపోయిన తరువాత ముగ్గురూ ఆ రూమ్ లో పైనుండి కిందదాకా ఉన్న వేల కొద్దీ రికార్డ్ లను చూసి ఏం చేయాలో తెలియలేదు. రాము : ఇన్ని వేల రికార్డులా…వీటిలో ఆ ఆత్మకు సంబంధించిన రికార్డ్ ఏంటో….అసలు ఆ ఆత్మ పేరు ఏంటో…ఈ రికార్డ్ లు అన్నీ చూడాలంటే కొన్ని నెలలు పట్టొచ్చు….మనకు అంత టైం కూడా లేదు…. ఆ మాటలు విన్న సుమిత్ర కూడా రాము మాట్లాడింది కరెక్టే అన్నట్టు తల ఊపుతూ…. సుమిత్ర : నువ్వు చెప్పింది కరెక్టే రాము….కాని ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాలి….అదేంటంటే….మనం వెదికే ఆత్మ ఒక ఆడదానికి….అందుకని జైళ్లల్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా…చాలా తక్కువగా ఉంటారు…. మహేష్ : కాని మనకు కావలసిన వివరాలు ఈ రికార్డ్స్ లోనే ఉన్నాయి కదా…..ఇక్కడ చూస్తే ఏ రికార్డ్ ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదు….మనం ప్రతి ఒక్క కేస్ హిస్టరీ చదువుతూ కూర్చోలేము కదా…రాము చెప్పినట్టు చాలా టైం పడుతుంది…. సుమిత్ర అవునన్నట్టు తల ఊపుతూ ఏదో ఆలోచించిన దానిలా…. సుమిత్ర : అవును మహేష్….మనం ఇప్పుడు ఆ ఆత్మని కనుక్కోవాలంటే మూడు వందల ఏళ్ళు వెనక్కు వెళ్లాలి…. రాము : ఏంటి నువ్వు మాట్లాడెది సుమిత్రా…మనం కాలంలో వెనక్కు ఎలా వెళ్తాము…. సుమిత్ర : నేను చెబుతాను నాతో రండి… అంటూ అక్కడ నుండి వాళ్ళిద్దరిని బయటకు తీసుకొచ్చింది. ముగ్గురూ అక్కడ ఉన్న కారిడాలోకి వచ్చి….. సుమిత్ర : ప్రపంచంలో అతి పురాతనమైన ఆచారాల్లో….ఇంగా ఆచారం ఒకటి….ఈ ఇంగా సంసృతి ప్రకారం అప్పటి మనుషులు బ్రతికి ఉన్న మనిషి యొక్క ఆత్మని కాలంలో వెనక్కు పంపించొచ్చు….ఈ ప్రయోగం చాలా ప్రమాదకరమైనది…..అందుకే దీన్ని ఇంతకు ముందు ఎవరూ ప్రయోగించలేదు….(అంటూ ఒక రూమ్ దగ్గరకు వచ్చి తలుపు తీసుకుని లోపలిక్ వస్తూ) నాకు ఈ విధానం గురించి తెలుసు….కాని ఎప్పుడూ దీన్ని ఉపయోగించలేదు….(అంటూ ఆ రూమ్ లో ఉన్న బాత్ టబ్ దగ్గరకు వచ్చి టాప్ తిప్పి టబ్ నిండా నీళ్ళు పట్టేసింది) ఇప్పుడు ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే….గర్భంలో ఉన్న శిశువు అమ్మ కడుపులో ఉన్న ఉమ్మ నీటిలో ఉండి కూడా ఊపిరి పీల్చుకుంటుంది….కాని కడుపులో నుండి బయటకు వచ్చిన తరువాత అలా ఊపిరి పీల్చుకోలేము… అందుకని మనం ఈ పధ్ధతిలో మూడు రకాలు ఉంటాయి….గాలి, శరీరం, ఆత్మ…..మనం ఆత్మకు శరీరానికి మధ్యలో నీటిని ఉపయోగించి….నీళ్ల సహాయంతో మనలో ఉండే ఆత్మని కాలంలో వెనక్కు పంపించొచ్చు…. మహేష్ : కాని మనం నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోలేం కదా….ఎలా….. సుమిత్ర : అవును…..ఒక్కసారి ఊపిరి బిగబెట్టడం….ఆ ఒక్కసారి ఊపిరి బిగబెట్టినంత సేపు….ఈ విధానంలో మనిషిలో ఆత్మ కాలంలో వెనక్కు వెళ్ళేది….ఆ మనిషి నీళ్ళల్లో ఎంత సేపైతే ఊపిరి బిగబెట్టి నీళ్ళల్లో ఉండగలుగుతాడో అంత సేపు ఆ మనిషిలో ఆత్మ కాలంలో వెనక్కు వెళ్తుంది….అందుకని ఎంత ఎక్కువ సేపు ఊపిరి బిగబెట్ట గలిగితే అంత టైం మనకు ఉన్నట్టు…. రాము : సరె….నేను నీళ్లల్లో ఊపిరి బిగబెట్టి ఉండటానికి రెడీగా ఉన్నాను….. రాము అలా అనగానే సుమిత్ర, మహేష్ ఇద్దరూ అతని వైపు చూస్తారు…. మహేష్ : ఏంటిరా నువ్వు రెడీగా ఉన్నావా….నీకు అసలు నీళ్లల్లొ ఈత కొట్టడమే రాదు….పది సెకన్లు కూడా నువ్వు ఊపిరి బిగబెట్టి ఉండలేవు….అలాంటిది నువ్వు నీళ్లల్లోకి వెళ్దామనుకుంటున్నావా….నేను వెళ్తాను…. రాము : వద్దురా….చూస్తూ చూస్తూ….నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టలేను….. మహేష్ : ఇంత దూరం వచ్చిన తరువాత ఇంక రిస్క్ ఏంటిరా….మనం ముగ్గురం ముందే అంతా సిధ్ధపడే ఇక్కడకు వచ్చాం కదా… సుమిత్ర : అవును రామూ….మహేష్ చెప్పింది కరెక్ట్….మనకు నీళ్లల్లో ఎంత ఎక్కువ సేపు ఊపిరి బిగబెడితే అంత ఎక్కువ టైం మనకు ఆ ఆడమనిషిని వెదకడానికి వీలవుతుంది.. సుమిత్ర అలా అనగానే రాముకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు….సుమిత్ర చేయబోయే ప్రయోగం మాటల్లో చెప్పినంత సులువు కాదని ముగ్గురికీ అర్ధమవుతున్నది….కాని అంతకంటే వేరే దారి కనిపించడం లేదు…రాము ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉందటం చూసి సుమిత్ర మహేష్ వైపు తిరిగి…. సుమిత్ర : మహేష్….రెడీ అవ్వు…. మహేష్ వెంటనే ఒంటి మిద ఉన్న షర్ట్ తీసి అక్కడ పక్కనే ఉన్న బెడ్ మీద పడేసి బనీను, ఫ్యాంట్ మీద టబ్ దగ్గరకు వచ్చాడు. సుమిత్ర : నువ్వేం భయపడకు మహేష్….నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ఆత్మను వెదకడానికి ట్రై చెయ్యి… మహేష్ : ఇన్నేళ్ళు వెనక్కు వెళ్తున్నాం కదా….నేను ఆమెను ఎలా గుర్తు పట్టాలి….. సుమిత్ర తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న క్రిస్టల్ ని బయటకు తీసి…. సుమిత్ర : ఈ క్రిస్టల్ హెల్ప్ తో…..దీని ప్రభావం వలన నీకు కేవలం ఆడవాళ్ళు మాత్రమే కనిపిస్తారు….నువ్వు అక్కడను వెళ్ళినప్పుడు వాళ్ళ మొహాలు, వాళ్ల పేర్లు…వాళ్ల ఒంటి మిద బట్టలు, వేసుకున్న గొలుసులు….ఇలా ఏమైతే చూసావో అవి మొత్తం నువ్వు గుర్తుపెట్టుకోవాలి….పద…. మహేష్ అలాగే అని తల ఊపుతూ టబ్ లోకి వెళ్ళి తల పైకెత్తి నీళ్ళల్లో పడుకున్నాడు….సుమిత్ర మహేష్ తల వైపు వచ్చి తన చేతిలో ఉన్న క్రిస్టల్ ని రెండు చేతులతో మూసి కళ్ళు మూసుకుని ఏదో మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ మహేష్ వైపు చూసి, “మహేష్….ఇక ఒక్కసారి ఊపిరి బిగబెట్టు,” అంటూ తన చేతిలో ఉన్న క్రిస్టల్ ని మహేష్ ఛాతీ మీద పెట్టి నీళ్ళ లోపలికి చిన్నగా పడుకోబెట్టింది. మహేష్ తన ఊపిరి బిగబెట్టి కళ్ళు మూసుకుని నీళ్లల్లోకి మునిగాడు…అలా మునిగిన మహేష్ ఆత్మ ఒక్కసారిగా అతని శరీరం నుండి వేరయి మూడు వందల ఏళ్ళు వెనక్కి ఇప్పుడు వాళ్ళు ఉన్న కోటలోకి వెళ్ళింది. (ఇక్కడ నుండి మహేష్ ఆత్మ రూపంలో పని చేస్తుంటాడు.) అలా మహేష్ ఆ కోటలో ఒక చోట ప్రత్యక్షమవుతాడు….తాను ఎక్కడ ఉన్నానా అని చుట్టూ చూస్తాడు. కోట అంతా చీకటిగా ఉండటంతో అక్కడక్కడా వెలుగు కోసం కాగడాలు వెలిగించి ఉంటాయి. ఆ కాగడాల వెలుగులో మహేష్ అక్కడ పరిసరాలను వెదుకుతూ తమకు కావల్సిన ఆమె కోసం వెదుకుతు ముందుకు వెళ్తాడు. అలా వెళ్తున్న మహేష్ కి దూరంగా ఒక చోట నుండి ఒకామె పాట పాడుతున్నట్టు, గజ్జెల సౌండ్ వినిపిస్తుంటుంది. ఆ సౌండ్ విన్న మహేష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది…అతని గుండె శబ్దం అతనికే వినిపిస్తుంటుంది. మహేష్ ధైర్యాన్ని కూడగట్టుకుని చిన్నగా ఆ పాట వినిపిస్తున్న వైపు వెళ్ళాడు. అలా వెళ్తున్నప్పుడు మహేష్ కి ఎవరూ కనిపించకుండా ఆమె పాట ఒక్కటే వినిపిస్తుండటంతొ భయపడుతూనే ఆమె ఉండే చెరసాల దగ్గరకు వెళ్ళి అక్కడ కటకటాల దగ్గర నిల్చుని లోపలికి చూసాడు. లోపల ఒకామె పాట పాడుతు తన పొడవాటి జుట్టుని దువ్వుకుంటుంటుంది. మహేష్ ఆమెనే తదేకంగా చుస్తూ ఆమె ఏం బట్టలు వేసుకున్నది….ఒంటి మీద ఏం నగలు వేసుకున్నది అంతా చూస్తుంటాడు. అలా దీక్షగా చూస్తున్న మహేష్ దగ్గరకు లోపల ఉన్న ఆమె ఊహించని విధంగా ప్రేతాత్మ అయిపోయి కటకటాల దగ్గర నిల్చుని ఉన్న మహేష్ గొంతు గట్టిగా పట్టుకున్నది. దాంతో మహేష్ కి ఊపిరి అందక గిలగిలలాడుతున్నాడు….అలా గిలగిలా కొట్టుకుంటుంటే….ఇక్కడ మహేష్ శరీరం నీళ్లల్లో విపరీతంతా కదులుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతుంటుంది. అది గమనించిన సుమిత్ర వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాము వైపు చూసి, “రాము…..తొందరగా బయటకు లాగు,” అని గట్టిగా అరుస్తూ మహేష్ ని బయటకు లాగటానికి ట్రై చేస్తుంటుంది. రాము కూడా మహేష్ భుజాలు పట్టుకుని బయటకు లాగడానికి విపరీతంగా ట్రై చేస్తాడు….కాని అక్కడ ప్రేతాత్మ మహేష్ ఆత్మ గొంతు పట్టుకోవడంతో మహేష్ శరీరం బాత్ టబ్ లోనుండి బయటకు రావడం చాలా కష్టంగా ఉన్నది. “నాకు తెలిసి ఆ ప్రేతాత్మ వీడిని ఆపుతున్నట్టున్నది,” అంటూ రాము మహేష్ ని పైకి లాగడానికి ట్రై చేస్తున్నాడు. “ఆ ప్రేతాత్మ మహేష్ ఆత్మని గట్టిగా పట్టుకున్నది….తొందరగా మహేష్ ని బయటకు లాగుదాం…..లేకపోతే ఆ ప్రేతాత్మ మహేష్ ని చంపేస్తుంది,” అంటూ సుమిత్ర టబ్ లొకి దిగి మహేష్ ని పైకి లాగుతున్నది. కాని వాళ్ళిద్దరి వల్లా కాకపోవడంతో రాము ఒక్కసారి పైకి లేచి చుట్టూ చూసి….అక్కడ మూలగా పడి ఉన్న ఇనుప రాడ్ తీసుకుని వచ్చి, “సుమిత్రా….పక్కకు జరుగు,” అని అరిచాడు. దాంతో సుమిత్ర టబ్ లోనుండి బయటకు రాగానే రాము తన చేతిలో ఉన్న రాడ్ తో టబ్ మీద గట్టిగా రెండు మూడు దెబ్బలు వేయగానే అది పగిలిపోయి అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. నీళ్ళు మొత్తం పోగానే మహేష్ పైకి లేచి ఆయాసపడుతూ గట్టిగా ఊపిరిపీలుస్తుండటం చూసి రాము కంగారుగా వాడి దగ్గరకు వచ్చి పట్టుకుని కుదుపుతూ, “అరేయ్….మహీ…నీకు ఏం కాలేదుగా…బాగానే ఉన్నావు కదా,” అంటూ కంగారుగా అడుగుతున్నాడు. ఒక్క నిముషం తరువాత మహేష్ మామూలు స్థితికి వచ్చి తను బాగానే ఉన్నట్టు సైగ చేసే సరికి అప్పటి దాకా టెన్షన్ తో చూస్తున్న రాము, సుమిత్రలు ప్రశాంతమ్గా ఊపిరి పీల్చుకుని అక్కడ నుండి తాము ఉండే గెస్ట్ హౌస్ కి వచ్చేసారు. అప్పటికి టై రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది. మహేష్ పది నిముషాలు రెస్ట్ తీసుకున్న తరువాత సుమిత్ర మహేష్ పక్కనే కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేసి…. సుమిత్ర : మహేష్….ఇప్పుడు ఎలా ఉన్నది….బాగానే ఉన్నది కదా…. మహేష్ : హా….ఇప్పుడు కొంచెం పర్లేదు…. రాము మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది వింటూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతుంటాడు. సుమిత్ర : ఇప్పుడు చెప్పు మహీ….నువ్వు అక్కడ ఏం చూసావు….అన్నీ సాధ్యమైనంత వరకు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చెయ్యి. మహేష్ : నన్ను ఆ ప్రేతాత్మ పట్టుకున్న తరువాత నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు….నేను ఏం గమనించలేదు….అది నన్ను పట్టుకోవడానికి ముందు మాత్రం ఆమె జుట్టు దువ్వుకుంటూ పాట పాడుతున్నది…..చేతికి మాత్రం ఒక తాయెత్తు కట్టుకుని ఉండటం గమనించాను.. సుమిత్ర : తాయెత్తా…..(అంటూ ఆలోచిస్తున్నది….) అది దేనికి కట్టుకుని ఉంటుంది…..నువ్వు చెప్పిన దాని ప్రకారం మనం ఎలాగైనా ఆ తాయెత్తు ఎక్కడున్నదో కనిపెట్టగలిగితే….మనం ఆ ఆడ ప్రేతాత్మని ఎలా అంతం చేయాలో తెలుసుకోవచ్చు….కాని మనం మూడు వందల ఏళ్ల తాయెత్తు ఎక్కడుందని వెతుకుతాం….మనం ఆ తాయెత్తుని కనిపెట్టడానికి ఏదైనా మార్గం వెదకాలి. అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా….రాముకి బాగా చిర్రెత్తుకొచ్చింది…మహేష్ అలా మరణానికి దగ్గరగా వెళ్ళి వచ్చేసరికి రాముకి చాలా అసహనంగా ఉన్నది….కోపంగా సుమిత్ర దగ్గరకు వచ్చాడు…. రాము : ఇక చాలు ఆపు సుమిత్రా….(అంటూ ఆమె వైపు కోపంగా చూస్తూ) నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్ధమవుతుందా….వేల ఆత్మల్లొ ఆత్మల్ని వెదకడం…..తాయెత్తులు వెదకడం…(అని అంటూ ఉండగా మహేష్ వెంటనే చైర్ లో నుండి లేచి రాముని ఆపుతున్నాడు….కాని రాము తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక) ఈమె ఇక్కడకు మనకు హెల్ప్ చేయడానికి రాలేదు…..తన ప్రయోగాలు ఎంతవరకు పని చేస్తున్నాయో మన మీద experiment చేయడానికి వచ్చింది….ఒక్క నిముషం లేటయితే నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు వణుకు వచ్చేస్తున్నది…. రాము అలా కోపంగా తనను మాటలు అంటుండే సరికి సుమిత్ర బిత్తరపోయి ఏం మాట్లాడాలో తెలియక అలాగే రాము వైపు చూస్తూ ఉండిపోయింది. మహేష్ మాత్రం రాముని ఆపడానికి ట్రై చేస్తూ, “ఏంటిరా….నువ్వు ఎందుకు అలా ఆవేశపడుతున్నావు….ప్రశాంతంగా ఉండు…. ఇప్పుడు నాకు ఏం కాలేదు కదా…సుమిత్ర ఇక్కడకు మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది…ఆమెను నువ్వు ఆలా కోప్పడతావేంటి,” అంటూ రాముని సమాధానపరుస్తూ అక్కడ నుండి బయటకు తీసుకెళ్లాడు. “ఏం హెల్ప్ చేస్తుందిరా….ఏం చేయడం లేదు….రేణుక అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నది….మనం ఇప్పటికి మనం బయలు దేరిన దగ్గరే ఉన్నాము….ఇందులో మనకు ప్రోగ్రెస్ అనేది కనిపించడం లేదు….ఈమెకు ఏం చేతకాదు…మనకు ఏ విధమైన హెల్ప్ చేయలెదు….,” అంటూ రాము ఆవేశపడిపొతు అరుస్తున్నాడు. కాని మహేష్ మాత్రం, “రాము….కంట్రోల్ చేసుకో….రా….మూ….ఎందుకిలా ఆవేశపడిపోతున్నావు….ఇక ఆపు,” అని అంటున్నాడు. రాము అక్కడనుండి చిరాగ్గా తన రూమ్ లోకి వెళ్ళి ఏం చెయ్యాలో తెలియక కూర్చుని ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. సుమిత్ర కూడా రాము మాటలకు చాలా భాధ పడిపోయింది. అలా ఆలోచిస్తున్న రాము అక్కడ టేబుల్ మీద తల పెట్టి పడుకున్నాడు….అలా పడుకున్న రాముకి తన రూమ్ డోర్ తెరుచుకుని బయట ఎవరో పిలిచినట్టు అనిపించడంతో రాము తల ఎత్తి అటు వైపు చుస్తూ మెల్లగా చైర్ లోనుండి లేచి రూమ్ లోనుండి బయటకు వచ్చాడు. బయట అంతా చీకటిగా ఉన్నది….రాము తనను పిలుస్తున్న పిలుపు వైపుగా నడుచుకుంటూ వెళ్ళేసరికి గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న చెరువు దగ్గర ఎవరో నిల్చున్నట్టు అనిపించడంతో అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నిల్చున్న ఆమెను చూసి, “ఎవరు,” అని అడుగుతాడు. దాంతో ఆమె వెనక్కు తిరిగి రాము వైపు చూస్తుంది….ఆమెను చూసిన రాము ఒక్కసారిగా బిత్తరపోయి రెండడుగులు వెనక్కు వేసి తాను చూస్తున్నది కలా నిజమా అన్నట్టు అక్కడ ఉన్న చెట్టుని పట్టుకుని అలాగే చూస్తుండిపోతాడు. “రేణుకా…నువ్వేంటి ఇక్కడా….నేను చూస్తున్నది కలా నిజమా….” అంటూ రాము రేణుక వైపు చూస్తుండిపోయాడు. “లేదు రాము….నువ్వు చూస్తున్నది నిజమే….నువ్వు నాకోసం పడుతున్న తపన….నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది,” అన్నది రేణుక. “నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కాలేదు,” అన్నాడు రాము. రేణుక రాము వైపు చూసి, “నేను నీకు హెల్ప్ చేయాలని వచ్చాను రామూ….నువ్వు దేని కోసం అయితే వెదుకుతున్నావో….ఆ తాయెత్తు ఎక్కడున్నదో నాకు తెలుసు…(అంటూ తన చేతిని రాము వైపు చాపి) నా దగ్గరకు రా రామూ….అంత దూరంగా కాదు….నాకు దగ్గరకు రా,” అన్నది. రాము చిన్నగా అడుగులొ అడుగు వేసుకుంటూ రేణుక దగ్గరకు వచ్చి ఆమె చేతిలో చెయ్యి వేసాడు. అలా రాము తన చేతిని రేణుక చేతిలో పెట్టగానే తన కళ్ళ ముందు ఒక్కసారిగా ఇంతకు ముందు గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చినప్పటి నుండీ జరిగిపోయిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి….అలా సంఘటనలు మొత్తం కదలాడి…మొదటిసారి గెస్ట్ హౌస్ కి వచ్చినప్పుడు వాచ్ మెన్ తమకు ఆ రాత్రి భోజనం వడ్డిస్తుంటే అతని మెళ్ళో తాయెత్తు ఉండటం తాను చూసినట్టు కనిపించింది. అలా తాయెత్తు కనిపించగానే రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని చుట్టూ అయోమయంగా చూసాడు. ఇందాక తాను సుమిత్ర మీద కోపంతో అరిచి రూమ్ లోకి వచ్చిన చోటే ఉండట….తనకు రేణుక కనిపించడం అంతా కలలాగా అనిపించింది. కాని నిజంగా రేణుక కనిపించకపొతే ఆ తాయెత్తు గురించి తనకు ఎలా తెలిసింది అని ఆలొచిస్తూ రూమ్ లో నుండి బయటకు వచ్చ హాల్లో కూర్చుని ఉన్న మహేష్ పక్కనే కూర్చుని పక్కనే తమ వైపు భయంగా చూస్తున్న వాచ్ మెన్ వైపు చూసి, “నీ మెళ్ళొ ఆ తాయెత్తు ఏంటి,” అనడిగాడు. రాము అలా వాచ్ మెన్ ని తాయెత్తు గురించి అడగ్గానే మహేష్, అక్కడే ఉన్న సుమిత్ర ఒక్కసారిగా తలెత్తి వాచ్ మెన్ మెడ వైపు చూసారు. అతని మెళ్ళొ ఒక తాయెత్తు వేలాడుతుండటంతో వాళ్ళ ముగ్గురి కళ్ళు ఒక్క సారిగా ఆనందంతో తళుక్కుమన్నాయి. వాచ్ మెన్ తన మెళ్ళొ తాయెత్తు తీసి రాముకి ఇస్తూ, “తీసుకోండి బాబూ….” అన్నాడు. రాము ఆ తాయెత్తు తీసుకుని వాచ్ మెన్ వైపు చూసి, “ఒక వేళ నీకు అభ్యంతరం లేకపోతే….నేను దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చా,” అనడిగాడు. “తప్పకుండా బాబూ….నాకేం అభ్యంతరం లేదు….తీసి చూడండి….ఈ తాయెత్తు నా మెళ్ళోకి మా అమ్మ చనిపోయిన తరువాత వచ్చింది….కాని ఈ తాయెత్తు మా తాతల కాలం నుండి ఒకరి తరువాత ఒకరికి అందుతూ నా దగ్గరకు వచ్చింది…మా పూర్వికులు రాజమహలో పని చేసేవాళ్ళు….,” అన్నాడు వాచ్ మెన్. రాము వెంటనే తాయెత్తు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చీటీ లాంటిది కనిపిస్తుంది. రాము ఆ చీటీని తన చేతిలోకి తీసుకుని చదవడానికి ట్రై చేసాడు…కాని అది అర్ధం కాకపోవడంతో మహేష్ వైపు చూసాడు. రాము : ఏం రాసున్నదిరా ఇందులో…నీకేమైనా అర్ధమవుతున్నదా…. మహేష్ కూడా ఆ చీటిని చదవడానికి ట్రై చేసినా అర్ధం కాక ఏం చేయాలా అని చూస్తుండగా ఎదురుగా సుమిత్ర కనిపించడంతొ రాము ఆమెను అడగడానికి ఇందాక తను కోప్పడిన విషయం గుర్తు కొచ్చి అడగలేకపోతుండటం చూసి….మహేష్ రాము చేతిలొ చీటీ తిసుకుని సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఆమె చేతికి ఇచ్చి, “ఇందులో ఏమున్నది….మా ఇద్దరికీ అర్ధం కావడం లేదు….నువ్వు చదివి చెప్పు,” అన్నాడు. దాంతో సుమిత్ర ఆ చీటీ తీసుకుని చూసి, “ఇది చాలా పురాతనమైన భాష….దీని అర్ధమేంటంటె….ఈ తాయెత్తు ఎప్పటి దాకా ఐతే మెళ్ళో ఉంటుందో అప్పటి దాకా ఈ మోహిని ఆత్మ రూపంలో బ్రతికే ఉంటుంది….” అన్నది. మహేష్ : మోహిని….మోహిని ఎవరు….. సుమిత్ర : మోహిని అంటె…..మనం ఇప్పటి వరకు ఎవరి కోసం అయితే వెదుకున్నామో ఆ ఆత్మ పేరు మోహిని…. తరువాత రోజు ముగ్గురూ కలిసి మళ్ళీ కోట లోకి వెళ్ళీ ముందు రోజు కలిసిన ఆఫీసర్ ని కలిసి మోహిని గురించి అడుగుతారు. క్యూరేటర్ : మోహిని….మహారాణీ మోహినీ…..ఈమె అప్పటి మహారాజు గజసింగ్ రెండో భార్య….నాకు తెలిసినంత వరకు గజసింహుడు చనిపోయిన తరువాత….ఆయన కొడుకు రంజిత్ సింగ్ ఆమెను జైల్లో పెట్టించాడు….అప్పటి నుండి ఆమె చనిపోయే చివరి రోజులు ఈ జైల్లోనే గడిపింది….ఆమెకు…..రంజిత్ సింగ్ కు మధ్య సంబంధాలు బాగా ఉండేవి కావు…. రాము : సార్….మోహిని గురించి ఇంకా ఏమైనా విషయాలు మీకేమైనా తెలుసా….. క్యూరేటర్ : ఆమె గురించి చాలా చాలా కధలు ప్రచారంలో ఉన్నాయి….కాని అవన్నీ ఎంత వరకు నిజమో నాకు తెలియదు…. సుమిత్ర : మీకు మోహిని గురించిన వస్తువులు గాని, ఆమె అలవాట్ల గురించి కాని ఏమైనా ఐడియా ఉన్నదా…
No comments:
Post a Comment