అలిగిన వేళనే….
” ఈ రోజు ప్రత్యేకంగా దేవుడిని ఏం కోరుకున్నావు?” గుడిలోంచి వచ్చాక, ఒకపక్కగా వున్న అరుగ మీద కర్చీఫ్ పరుచుకుని కుర్చుంటూ అన్నాడు సుబ్బారావు.దేదీప్య మనోహరంగా నవ్వింది!పాలరాతి శిల్పానికి ఆల్చిప్పలు అతికించినట్టున్న ఆమె విశాల నయనాలలోసుబ్బారావుపట్ల ఆరాధన! నిటారుగా వున్న నాసిక! ఎర్రగా నోరూరించే చెర్రీపళ్ళరంగును పులుముకున్న సన్నని పెదాలు,గుండ్రటి మెడ! కింద చూపుతిప్పుకోలేనట్లు చేసే ఎత్తయిన, గుండ్రటి అమృత భాండాలు!అది గుడి కావడంతో సుబ్బారావు చప్పున ఆమె పై నుంచి దృష్టి గాలిగోపురం మీదకుమళ్ళించి, “ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇంతకీ దేవుడిని ఏంకోరిక కోరావో చెప్పనేలేదు” అన్నాడు.
“కోరిక ఏమి కోరలేదు. అయితే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను” అంది।
“దేనికి?” అనడిగాడు సుబ్బారావు .
” మిమ్మల్ని భర్తగా ప్రసాదించినందుకు!”
“అవును ఈ ఏడాదిలో ఏనాడూ నా మనసు నొప్పించలేదు. నేను అడిగింది కాదనలేదు.నాకు ఏవిషయంలోనూ కోపం తెప్పించలేదు. నాకు ఇంట్లోనే కాదు, కాలేజీలో కూడా “కోపం ముక్కు” అనే నిక్ నేమ్ వుండేది! మా అమ్మ అంటూండేది….”ఆ సత్యభామనిమించి మొగుడిని సాధించుకుతింటావ్, నీ అలకలు తీర్చలేక అమాయకపు ప్రాణిసన్యాసం పుచ్చుకోవడం ఖాయం” అని.
“మీరు ఏం మంత్రం వేశారో, నా కోపం అంతా ఏమై పోయిందో నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది” అని సుబ్బారావు బుగ్గమీద చిటికేస్తూ అంది దేదీప్య.
” నీకూ కోపం వస్తుందా? నమ్మలేకపోతున్నాను!” ఆమె చేతిని తన చెతుల్లోకి తీసుకున్నాడు సుబ్బారావు.
”నేను కూడా నమ్మలేనంత నన్ను మార్చి న ఈ మంచి మొగుడిని నాకు ఇచ్చినందుకు ఈ పెల్లిరోజున ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలి కదా !”
”పద పద …సినిమాకి టైం అయింది !” కర్చీఫ్ దులుపుకుంటూ లేచాడు సుబ్బరావు.అప్పుడే స్నానం పూర్తిచేసి ,నీలం పువ్వులున్న నైట్ కాటన్ శారీ కట్టుకునిబెడ్ రూంలోకి వచ్చింది దేదీప్య ! రాత్రి పది దాటింది . ఏ కాలంలో అయినాపడుకోబోయే ముందు స్నానం చేయడం దేదిప్యకు అలవాటు . మంచం మీద ఆ వై పుకుపడుకుని ,టీవిలో ఏదో మ్యూజిక్ చానల్ చూస్తున్నాడు సుబ్బారావు.
ఇన్స్ ఫెక్షన్ పని చూసుకుని ఖమ్మం నుంచి రెండు గంటల క్రితమే వచ్చాడుఅతను.” రేపు మన రెండో మ్యారేజ్ డే! నేను అక్కడ, నువ్వు ఇక్కడ ! ఎలాకుదురుతుంది అందుకే రెండు రోజులు రాత్రిళ్ళు కూడా వర్క్ చేశాను ” అన్నాడుడైనింగ్ టేబుల్ దగ్గిర.దేదీప్య ఏమీ మమాట్లాడలేదు.
పెళ్ళయిన రెండు సంవత్సరాల్లో దేదీప్య ముభావంగా వుండటం ఇదే చూడటం- సుబ్బరావు కి ఆరాటంగా వుంది.
”నువ్వేదో దాస్తున్నావు!”
”అబ్బ ఏం లేదన్నాను కదా ,త్వరగా భోజనం చేసి వెళ్ళండి ” అరిసినట్లుగాఅంది దేదీప్య . మౌనంగా భోజనం ముగించి ,బెడ్ రూంలోకి వెళ్లి టీవీపెట్టుకుని కూర్చున్నాడు సుబ్బారావు .దేదీప్య వంటిల్లు సర్దుకుని ,అలవాటుగా స్నానం ముగించుకుని వచ్చింది . మేడమీద ‘ యార్డ్ లీ’ పౌడర్ ఒంపుకుటున్న దేదీప్య వైపు క్రీగంట చూశాడుసుబ్బారావు . దేదీప్య ఇంకా సీరియాస్ గానే వుంది.
”భార్య పుట్టింటికి వెల్లడంతో హీరో ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు .టైం రాత్రి ఎనిమిది కావొస్తోంది . టీవీ లో ఏదో గేమ్ షో మంచం మీద వెల్లకిలా పడుకుంది . కుడిచేయి తలకింద పెట్టుకుని ఏదో అలోచనలో వున్న దేదీప్య ,తెల్లని కాటన్ చీరలో పరిమళాలు వెదజల్లుతున్న దేవతలా వుంది. నాలుగు రోజుల బలవంతపు బ్రహ్మచర్యం పాటించిన సుబ్బారావుకి దేదీప్య ను తాకకుండా వుండటం అసంభవం అనిపించింది . అయితే ఎర్రబడి వున్నా దేదీప్య మొహం చూస్తుంటే ఆమె ఒంటి మీద చేయివేసే ధైర్యం లేదు.
” టీవీ కట్టేయండి” హటాత్తుగా అంది దేదీప్య . చేతిలోని రిమోట్ తో టక్కున టీవీ ఆఫ్ చేశాడు సుబ్బారావు. ”కొంచెం దూరం జరగండి ” గోడవారగా జరిగిపోయాడు సుబ్బారావు. ” మీకో కథ చెప్పాలి ! మధ్యలో ప్రశ్నలు వేయవద్దు ” అంది దేదీప్య . ”అలాగే” అన్నాడు సుబ్బారావు .దేదీప్య కథ చెప్పడం మొదలుపెట్టింది. వస్తుంది. సీరియస్ గా చూస్తున్న హీరో కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడ్డాడు. టీవీ సౌండ్ తగ్గించి, వెళ్లి తలుపు తీశాడు . గుమ్మంలో ఒక ఇరవైఏల్ల అమ్మాయి ,మెరుపుతీగలా వుంది.
కళ్ళప్పగించి తాననే చూస్తున్న హీరోను చూసి, గుమ్మంలో ఆ అమ్మాయి ఇబ్బందిగా కదిలింది. ”లోపలికి రావచ్చా?” అనడిగింది. ‘రండి అప్రయత్నంగా పక్కకు తొలగి దారి ఇచ్చాడు హీరో. లోపలికొచ్చి సోఫాలో పొందికగా కూర్చుంది ఆమె . మరో సోఫాలో కూర్చుంటూ టీవీ అన్ చేశాడు హీరో. ”నేను ఒంటరి దానిని . ఈ మధ్యే నాన్న పోయాడు .బి.ఎ. పాస్ అయ్యాను నేను ” అడకకుండానే తన గురించి చెప్పడం ఆరంభించింది ఆమె. వీధిలో పెద్దగ చప్పుడు చేసుకుంటూ వెళుతోంది వెహికల్ .
No comments:
Post a Comment