నా 5 వ సంవత్సరములో మొదలైన నా జుత్తు ప్రేమఅనకాపల్లిలో మేము , మా పక్కనే ఇంకో కుటుంబం ఒకే ఇంట్లో రెండు భాగాల్లో ఉండేవాళ్ళం. ఆ కాలంలో ఎవరైనా , అత్తా అని పిలవడం నేర్పేవారు. అలా పక్కనే ఉన్న అత్త పసుపు పచ్చని చాయతో , నల్లని పెద్ద జడ తో ఉండేది. నేను కొంచెం బొద్దుగా , తెల్లగా ఉండేవాణ్ణి . నన్ను ఎప్పుడూ తనతోనే ఇంట్లో తిప్పుకొనేది. నేను ఎప్పుడూ అత్త వీపుమీద పడి ఊగేవాణ్ణి లేదా ఒళ్ళో కూచునేవాణ్ణి. . అప్పుడు నేను తన జడని లాగే వాణ్ణి . రోజూ తను మధ్య వరండా లో కూచొని , తలకు నూనె రాసుకొని , జడ వేసుకొనేది.
తను రోజూ జడ వేసుకోవడానికి జుత్తు విప్పుకొనే సమయానికి కూరల ఆవిడ వచ్చేది . తను దువ్వెన జుత్తులో పెట్టుకొని కూరలు చూడడానికి ముందు వరండాలో కూరల బుట్ట ముందు కూచొనేది. అప్పుడు నేను తన వీపుమీద వాలి , జుత్తుని సర్దుతూ ఉండేవాణ్ణి . దువ్వెన జుత్తు లొంచి తీసి తల మీద దువ్వేవాణ్ణి. ఈ పని రోజూ ఉండేది . తను తలంటుకొన్ననాడు , తడి తల మంచి వాసన వచ్చేది . నేను తన జుత్తుతో , జడతో ఆడుతున్నప్పుడల్లా – ” ఏరా అల్లుడా , నీకు జుత్తు బాగా నఛ్ఛిందా – పెద్ద జుత్తున్న పిల్లని పెళ్ళి చేసుకో , రోజూ తల దువ్వి జడ , ముడి వేయవచ్చు .” అనేది .నేను అత్త ఒళ్ళో కూచున్నప్పుడు , తన జడ నా మీద పడేటట్టు వేసేది. నెను ఆ జడని విప్పుతూ , మళ్ళీ వేస్తూ ఆడుకొనేవాణ్ణి. ఎవరైనా , కుర్రాడు నీ జడని పాడూ చేస్తాడే అంటే , ” మా అల్లుడు మంచివాడు – చిన్నవాడు , ఆడుకొంటున్నాడు , ఏం పరవాలేదు ” అని నన్ను ముద్దు పెట్టుకొనేది . ఒక్కోసారి “అత్తా పేలు చూడనా , జడ వెయ్యనా ” అంటే , తను జడ విప్పి కూచునేది . నేను వెనుక చేరి జుత్తుతో ఆడుకొనే వాణ్ణి.
అలా అత్త జుత్తు తో నాలుగు ఏళ్ళు ఆడుకొన్నాను . నా తొమ్మిదవ ఏట, అత్త తలకి నూనె రాయడం , దువ్వడం , పేలు చూడడం నేర్పడం మొదలెట్టింది.
ఒక రోజు అత్త కూచొని జుత్తు విప్పుకొంటూ ఉంటే ” నేను విప్పనా అత్తా ” అంటె ” ఓరి భడవా , ఏంటి నూనె రాసి జడ కూడా వేస్తావా ” అంది. ” నువ్వు నేర్పితే చేస్తాను అత్తా ” అన్నా. ముడిని అలాగే ఉంచుకొని , నన్ను గదిలోకి తీసుకెళ్ళింది . నన్ను ముడ్డాడి , ” మరి నేర్పుతా , రోజూ నూనె రాసి జడ వెయ్యాలి , పేలు పడితే పేలు చూస్తావా ” అంది. ” నా కెంతో సరదా ఆహా అత్తా ” అన్నానునేను వెనుక చేరి అత్త ముడి విప్పాను. అత్త జుత్తుని రెండు పాయలు గా చేసుకొని ముందుకి వేసుకొని నన్ను తన కాళ్ళ మీద కూర్చో బెట్టుకొంది. తను జుత్తు ఒక పాయని నా చేతిలో పెట్టి , దువ్వెన తీసుకొని ఎలా దువ్వాలో చెప్పడం మొదలెట్టింది. అలా అత్త కాళ్ళమీద కూచొని ,ముందు జుత్తు ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో దువ్వడం నేర్చుకొన్నాను .
తరువాత ముందుకూర్చొనే తల మీద చెయ్యి పెట్టి దువ్వడం నేర్పింది . దువ్విన జుత్తుని వెనక్కి వేయమంది. వెనక్కి వెళ్ళి తల మీద నుంచి కిందవరకు దువ్వమంది. నా చేత దువ్వించుకున్నాక , దువ్వెన తీసుకొని పాపిడి తీసుకొంది .” మెల్లి మెల్లి గా పాపిడి తీయడం , జడ వేయడం చెబుతానురా ” అని , జడ వేసుకుంతూ ఉంటే , నేను అత్త కాళ్ళ మీద కూచొని , మధ్య మధ్య లో పాయలని దువ్వేను .
ఆ రోజు మధ్యాహ్నం , సాయంత్రం కూడా , అలాగే నేను తల దువ్వితే – తాను పాపిడి తీసికొని జడ వేసుకొంది. అలా ఒక వారం రోజులు నేర్పింది . ఆ రోజు తల దువ్వుతూ ఉంటే – ” ఈ రోజు పాపిడి తియ్యడం , జడ పాయలు తీయడం చెబుతానురా అల్లుడా ” అంది. “చెప్పు అత్తా ” అని జుత్తుని నున్నగా దువ్వాను . నన్ను ముందుకి వచ్చి తన ఒళ్ళో కూచోమంది . నా ఎడమచేయి తన తల వెనక్కి పెట్టి దువ్వెన పట్టుకున్న నా కుడిచేతిని పట్టుకొని నుదిటి మీద నుంచి పైకి దువ్వించింది. అలా నా కుడి చేత్తో మధ్య పాపిడి తీయించి ,పక్కలకి పడిన జుత్తుని దువ్వించి తన ఎడం చేత్తో గుప్పిట్లో పెట్టుకొని , నన్ను వెనక్కి వెళ్ళమని , జుత్తుని నా గుప్పిట్లో పెట్టి , గట్టిగా పట్టుకొని గుప్పిటి కిందనుంచి చివరవరకు దువ్వమంది .
అప్పుడు జుత్తుని తన ఎడంచేతి గుప్పిట్లో పెట్టుకొని నన్ను జుత్తుని మూడు భాగాలుగా చెయ్యమంది . నన్ను ఒక పాయని పట్టుకోమని , రెండు పాయలు తన చేతులోకి తీసుకొని , నా చేతిలో పాయని ఇంకో పాయ మీద పెట్టి , నా చేతిలోకి రెండో పాయ ఇచ్చింది . తరువాత మూడో పాయని ఇచ్చి ,జడ మొదటిది తయారయింది. అలా తన భుజాలవరకు వేయించి , అలా ఆ జడని ముందుకు తీసుకొని , నన్ను మళ్ళీ ముందుకు రమ్మంది .
నేను ముందు కూర్చుని మళ్ళీ ఒక్కక్క పాయని అత్త చెప్పినట్టుగా కలుపుతూ జడ వెయ్యడం నేర్చుకున్నాను..తరువాత జడని వెనక్కి వేసి , నన్ను వెనక్కి వెళ్ళమంది . నా ఎడంచేతి గుప్పెట్లో జడ పై భాగాన్ని పెట్టి , కుడిచేయి పట్టుకొని – జడ చివరి వరకు సర్దించింది .అలా రోజుకు మూడు సార్లు 15 రోజులు పాటు ఓపిగ్గా నాకు జడ వేయడం నేర్పింది. అలా నా తొమ్మిదో యేడు వచ్చేసరికి – తల దువ్వి , పాపిట తీసి జడ వెయ్యడం – మొదటి సారి ఆత్తా అని పిలిచిన కమల అత్త నేర్పింది . అప్పటి నుంచి రోజూ నేనే అత్తకి మూడు పూటలా తలదువ్వి జడ వేసే వాడిని.
సాయంత్రం పూట నేను జడ వేస్తున్న సమయానికి , మామయ్య వచ్చేవాడు . ” ఒహో అల్లుడు జడ వేస్తున్నాడా ” అని నవ్వేవాడు. ఒక్కోసారి సాయంత్రం పూట మల్లె పువ్వులు మాల కట్టి , జడలో పెట్ట మనేది. ఎలా సర్ది పెట్తాలో కూడా తానే నేర్పింది.
మర్నాడు నా 10 వ పుట్టిన రోజు .సాయంత్రం, అత్తకి మధ్యహ్నం వేసిన జడ విప్పి , మళ్ళీ జడ వేయడానికి తల దువ్వుతున్నాను. “ఒరే అల్లుడా రేపు నీకు తలకి నూనె రాయడం నేర్పుతానురా. మధ్యాహ్నం తీరిగ్గా నేర్పుతాను” అంది. ” నేర్పీ అత్తా , రోజూ ఇంక నూనె కూడా నేనే రాస్తాను ” అన్నా . ” అవునురా అల్లుడూ , నువ్వు నా తల దువ్వి జడ వేస్తూ ఉంటే చాలా హాయిగా ఉంటోందిరా .నూనె కూడా రాస్తూ ఉంటే ఇంకా హాయిగా ఉంటుందిరా ” అంది.
మర్నాడు పొద్దుట , అత్త ముడి చూస్తే , నిన్న నేను వేసిన జడనే ముడి వేసుకొని ఉంది. నేను ముడి విప్పుతూ ఉంటే “మధ్యాహ్నం నూనె రాయడం నేర్పాలి కదా , అందుకే ఇవాళ పొద్దుట రాసుకోలేదు ” అంది నవ్వుతూ . నెను జడ విప్పుతూ ఉంటే వెనక్కి తిరిగి నన్ను ముద్దు పెట్టుకొంది . అత్తకి జడ విప్పి – బాగా నున్నగా దువ్వి – జడ వేసి పెట్టాను.
మధ్యాహ్నం నేను అత్త తో కలిసి తన గదిలోకి వెళ్ళాను . అత్త కొబ్బరినూనె సీసాలోంచి , గిన్నెలోకి పోసి , రెండు దువ్వెనలు గిన్నె మంచం మీద పెట్టి , ఒక స్టూల్ మంచం ముందు వేసింది . నన్ను మంచం మీద కూర్చోబెట్టింది. ” అల్లుడూ నూనె రాసినప్పుడు , చీర పాడైపోవచ్చు” అంటూ చీర విప్పేసింది . మొదటి సారి అత్తని లంగా జాకెట్టులో చూస్తున్నాను. వచ్చి నా ముందు స్టూల్ మీద కూచొని ” అల్లుడూ – మొదలెడదాము , జడ విప్పి ,ముందు బాగా చిక్కు లేకుండా దువ్వు ” అంది. “అలాగే అత్తా ” అని జడని విప్పి బాగా దువ్వేను . “నూనె గిన్నె ఇలా ఇచ్చి , నీ రెండు చేతులు ముందుకు పెట్టు ” అంది. రెండు చేతులు తన భుజాల మీదుగా ముందుకు పెట్టాను . అత్త జుత్తు నా మొహానికి తగులుతోంది . గిన్నె ఒళ్ళో పెట్టుకొని , నా చేతులకి నూనె రాసింది . నారెండు చేతులు పట్టుకొని , తన తల మీద నుంచి రెండు పక్కలా మాడు మీద రాయించింది .మళ్ళి చేతులకి నూనె రాసి , ఈసారి రెండు చేతులని మెడ కిందనుంచి మాడులోనికి పోనిచ్చి రాయించిది.”ఇప్పుడు జుత్తుని రెండు పాయలు చేసి ముందుకి వేసి ,నువ్వు ముందుకు రా ” అంది.
అత్త చెప్పినట్టు చేసి ముందుకు వెళ్ళా . నా కుడి చెయ్యి నూనె గిన్నెలో ముంచి , రెండు చేతులకి రాయించి – ఒక పాయని నా చేతులో పెట్టి పైనుంచి కిందవరకు రాయమంది . అలాగే రెండో పాయకి కూడా రాయించింది . అలా మూడు సార్లు రాయించింది . ” ఇప్పుడు రెండు పాయలు వెనక్కి వేసి , వెనక్కి వెళ్ళు అల్లుడూ ” అంది . వెనక్కి వెళ్ళి రెండు పాయలని వెనక్కి తీసుకొని కలిపేసాను. రెందుచేతులు ముందుకి చాస్తే , నూనె చేతులకి పెట్టింది. ” ఇప్పుడు మాడు మీద నుంచి కిందవరకు రాయి అల్లుడూ” అంది. ” అలాగే అత్తా ” అని , అలా మూడు సార్లు రాయించింది.
మళ్ళీ నా చేతులు పట్టుకొని మెడ కింద నుంచి జుత్తు లోనికి పోనిచ్చి – బాగా రాయించింది. అత్త జుత్తు పొడుగు , లావు కూడా ఉండడంతో గిన్నె లోని నూనె పూర్తి అయిపోయింది . “ఈ రోజుకి ఇది చాలు – మెల్లి మెల్లి గా మాసేజ్ చెయ్యటం కూడా చెబుతాను. చిక్కు తీసి , తల దువ్వి జడ వేసిరా అల్లుడూ ” అంది. “అలాగే అత్తా ” అని జుత్తు పాయలుగా చేసి దువ్వి , జడ వేసేసాను . అత్త వీపుమీద , జాకెట్టుకి కొంచెం నూనె మరకలు అంటుకున్నాయి . ” అందుకేరా చీర తీసేసాను , ఈ గుడ్డతో వీపు తుడిచేసేయి” అని గుడ్డ ఇచ్చింది. అత్త భుజమ్మీద చెయ్యి వేసి జడ ముందుకువేసి , వీపు -మెడ బాగా తుడిచేసాను. . “ఎలా ఉంది అల్లుడూ , బాగుందా నూనె రాయడం ” అంది.
అత్త వీపుమీదగా చేతులు పెట్టి ముందుకు చాపి ” చాలా బాగుంది అత్తా , రోజూ మరి రాయనా ” అన్నా . ” రోజూ నీ చేత రాయించుకుందామనే కదరా , నీకు అన్నీ నెర్పుతున్నాను ” అంది. “రోజూ స్నానం కి ముందే నూనె రాయాలి , పాలు తాగగానే వచ్చేయి రోజూ ఇక మీద ” అంది. అత్త జడని పట్టుకొని ఊగుతూ ” అలాగే అత్తా ” అన్నా .
ఇంక మర్నాటి నుంచి – అత్త జుత్తు మీద మొత్తం నాదే పెత్తనం అయిపోయింది. పోద్దుటే వెళ్ళి నూనె రాసి , తను స్నానం చేసి వచ్చేవరకు ఉండి , వఛ్ఛేక తల దువ్వి జడ వేసే వాడిని.మళ్ళీ మధ్యహ్నం, సాయంత్రం జడ వేసే వాడిని . అలా 20 రోజుల్లో తల కి నూనె రాయడం , మాసేజ్ చెయ్యడం బాగా వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి అత్త జుత్తు మీద అన్ని అధికారాలు నావే . మావయ్య ఎదురుగానే – అత్తయ్యకి జుత్తు పనులు చేసే వాడిని.
అత్త శనివారాలు తలంటుకొనేది. ఆ రోజు అత్త జుత్తు తో రోజంతా గడిచిపోయేది .
No comments:
Post a Comment